
ట్యాగ్ · 2 కథనాలు

చిరు-కొరటాల మూవీ నుండి త్రిష ఔట్..!

"ఆచార్య"మూవీ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్
కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా "ఆచార్య " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా ఎంపిక అయినా అనివార్య కారణాల వలన ఆమె వైదొలిగిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా కాజల్, అనుష్క పేర్లు వినిపించినా ఫైనల్ గా కాజల్ ఎంపిక అయ్యారు.
చిరు-కొరటాల మూవీ నుండి త్రిష ఔట్..!
ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ చిరు-కొరటాల సినిమాకు ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్ నటిస్తాడా..? మహేష్ నటిస్తాడా అన్న విషయంలో క్లారిటీ రాలేదు. అలా అని ఈ విషయంపై వార్తలూ ఆగలేదు. అప్పుడప్పుడు బన్నీ పేరు కూడా వినిపిస్తుంది. ఇక దీనిపైనే క్లారిటీ ఇవ్వలేక చిత్రయూనిట్ తలపట్టుకుంటే.. టైటిల్ కూడా పెద్దతలనొప్పిగా తయారైంది. నిజానికి ఈసినిమాకు 'ఆచార్య' టైటిల్ నే అనుకున్నారు. కానీ చిరు చేసిన చిరు పొరపాటు వల్ల మళ్ళీ టైటిల్ ను మార్చే ఆలోచనలో ఉన్నారట. ఇప్పుడు దానికి తోడు మరో సమస్య వచ్చి పడింది.