
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు

“ఏక్ మినీ కథ”తో యంగ్ హీరో సంతోష్ శోభన్ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రాగా... ఈసినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు సంతోష్ శోభన్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈనేపథ్యంలోనే సంతోష్ శోభన్, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో మారుతి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక మారుతి అలా మొదలుపెట్టాడో లేదో చాలా తక్కువ రోజుల్లోనే సినిమాను పూర్తి చేశాడు. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా తాజాగా ఈసినిమా నుండి క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో ఈసినిమాలో నటిస్తున్న పాత్రలను పరిచయం చేశారు.