
ట్యాగ్ · 2 కథనాలు


చంద్రయాన్ 3 దేశానికి గర్వకారణం

చంద్రయాన్ 3 సక్సెస్‌పై స్పందించిన టాలీవుడ్ సెలెబ్రిటీలు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన 'చంద్రయాన్ 3' మిషన్ సూపర్ సక్సెస్ అయింది. తద్వారా రోదసిలో ఇప్పటివరకు మరే దేశమూ అందుకోలేకపోయిన లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుని చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో అత్యంత సంక్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధ్రువంపై 'ఇస్రో' విక్రమ్ ల్యాండర్‌ను దించింది. 17 నిమిషాల టెర్రర్ ప్రక్రియ అనంతరం విక్రమ్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. జాబిల్లిపై విక్రమ్ ల్యాండ్ అయిన కొన్ని గంటల తర్వాత దాని లోపలి నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి తొలి చంద్రుడి తొలి ఫోటోను పంపించింది. కాగా ఇప్పటివరకూ చంద్రునిపైకి అమెరికా, రష్యా, చైనా మాత్రమే రోవర్లను పంపాయి.

చంద్రయాన్ 3 దేశానికి గర్వకారణం
ఇస్రో (భారతీయ అంతర్జాతీయ రీసెర్చ్) సంస్థ నాలుగేళ్ల కిందట ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో విఫలమైన విషయం తెలిసిందే కదా. అయితే నేడు చంద్రయాన్ 3 ప్రయోగంతో వచ్చేశారు. చంద్రయాన్ 3 రాకెట్ విజయవంతంగా భూ కక్ష్యలోకి ప్రవేశించింది. 24 రోజులపాటు భూ కక్ష్యలోనే ప్రదక్షిణ చేయనుంది. అనంతరం 3.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. తర్వాత చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండ్ అయి అక్కడి ఉపరితలంపై అధ్యయనం చేయనుంది. ఇక ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూసిన చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కావడంతో దేశవ్యాప్తంగా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.