
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో పీరియాడికల్ లవ్ స్టోరీ "రాధేశ్యామ్ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. "రాధేశ్యామ్ "మూవీ తరువాత ప్రభాస్ 3 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "తానాజీ" మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో 3D ఫార్మాట్ లో "ఆదిపురుష్ ", బ్లాక్ బస్టర్ "మహానటి "మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ , బ్లాక్ బస్టర్ "కెజి ఎఫ్ చాప్టర్ 1 "మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ "సలార్" మూవీ తెరకెక్కనున్నాయి.