
ట్యాగ్ · 61 కథనాలు · పేజీ 4


బిగ్ బాస్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం.. కంటెస్టెంట్స్ ఎవరో తెలుసా?
తెలుగునాట 'బిగ్ బాస్' రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లి తెర వీక్షకుల్లో ఈ షోకి ప్రత్యేకంగా ఫ్యాన్స్ బేస్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పటివరకూ ఈ షో తెలుగులో 6 సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్ ఏడో సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా మొదలైన ఈ కార్యక్రమంలో హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున కంటెస్టెంట్లను హౌస్‌లోకి ఆహ్వానించారు. నాగ్ గత కొన్ని రోజులుగా 'ఉల్టా పుల్టా' అంటూ ఈ సీజన్ ప్రోమోతోనే ఆసక్తి పెంచిన సంగతి తెలిసిందే.