
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 2 కథనాలు

ఆకృతి &ఆశ్రిత సమర్పణ లో ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కమెడియన్ శ్రీనివాస రెడ్డి హీరో, నిర్మాత, దర్శకుడిగా ఒక మంచి రసగుల్లా లాంటి సినిమా ట్యాగ్ లైన్ తో రూపొందిన కామెడీ ఎంటర్ టైన్ మెంట్ భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు మూవీడిసెంబర్ 6వ తేదీ రిలీజ్ కానుంది. సత్య, షకలక శంకర్, వెన్నెల కిషోర్, రఘుబాబు, సత్యం రాజేష్, ప్రవీణ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి సంగీతం సాకేత్ కోమండూరి , స్టోరీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ జయమ్ము నిశ్చయమ్మురా మూవీ ఫేమ్ పరం సూర్యాన్షు అందించారు
ఇన్ని రోజులు తన కామెడీ తో.. మరోవైపు హీరోగా ఆకట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకున్న సంగతి తెలిసిందే. తనే దర్శక నిర్మాతగా మరి భాగ్య నగర వీధుల్లో గమ్మత్తు అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.