
ట్యాగ్ · 2 కథనాలు


"F 3" మూవీ అప్ డేట్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ -తమన్నా , వరుణ్ తేజ్ - మెహరీన్ జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్" F 2 :ఫన్ &ఫ్రస్టేషన్ "మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు అనిల్ తెరకెక్కించిన " F 2 :ఫన్ &ఫ్రస్టేషన్ "మూవీ విశేష ప్రేక్షకాదరణ పొందింది. హీరోలు వెంకటేష్ , వరుణ్ తేజ్ తమ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. " F 2 :ఫన్ &ఫ్రస్టేషన్ "మూవీ సీక్వెల్ "F 3" మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసిన అనిల్ రావిపూడి
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 'ఎఫ్2'. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్‌లో నవ్వులు పూయించాడో తెలిసిందే. అంతేకాదు రూ.120 కోట్ల గ్రాస్,రూ.80 షేర్‌ను రాబట్టి కలెక్షన్స్ పరంగా కూడా వెంకీ,వరుణ్ ఆఖరికి దిల్ రాజు కెరీర్ లో కూడా బెస్ట్ కలెక్షన్స్ అందించింది. ఇక ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు అనిల్ రావిపూడి, దిల్ రాజు.