
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు


సుందర్ సి. తమిళంలో 'అరణ్మనై' టైటిల్ తో వరుస సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటి వరకూ 'అరణ్మనై1', 'అరణ్మనై2' సినిమాలు వచ్చాయి. తెలుగులో కళావతి, చంద్రకళ టైటిల్స్ తో ఈసినిమాలు రిలీజ్ అయ్యాయి. హార్రర్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు కాబట్టి రెండు సినిమాలు కూడా మంచి విజయాన్నే దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు ఇదే సిరీస్ లో భాగంగా 'అరణ్మనై 3' సినిమా కూడా వస్తుంది. ఆర్య, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తుంది. ఇక ఈసినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో 'అంతఃపురం' టైటిల్ తో విడుదల అవుతుంది.