
ట్యాగ్ · 2 కథనాలు


'పుష్ప'లో రంగమ్మత్త జాయిన్

"పుష్ప "సెట్స్ లో అనసూయ
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక మందన్న జంటగా మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ”పుష్ప “మూవీ లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు .జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్, అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

'పుష్ప'లో రంగమ్మత్త జాయిన్
మొత్తానికి పుష్ప సినిమాలో రంగమ్మత్త అదే అనసూయ ఛాన్స్ కొట్టేసింది. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా పుష్ప సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా దాదాపు కీలకభాగాన్ని షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈసినిమాలో మొదట అనసూయ కూడా ఉంటుందన్న వార్తలు వచ్చాయి. ఆతరువాత తను ఈసినిమాలో లేదని క్లారిటీ ఇచ్చింది. కానీ ఇటీవల చావు కబురు చల్లగా సినిమా ఈవెంట్ లో బన్నీని డైరెక్ట్ గా అనసూయ అడిగింది. మరి ఆతరువాత ఏమైనా క్యారెక్టర్ యాడ్ చేశారేమో తెలియదు కానీ మొత్తానికైతే అనసూయ పుష్ప సినిమాలో నటించే అవకాశం దక్కించుకంది. ఆ విషయాన్ని తనే స్వయంగా తన ఇన్స్టా ద్వారా తెలియజేసింది. పుష్ప షూటింగ్ లో జాయిన్ అవుతున్నట్టు…