ట్యాగ్ · 4 కథనాలు

మై గాడ్ బన్నీ.. నిన్ను గుర్తుపట్టలేకపోయా..!

అల్లు అర్జున్ ను గుర్తుపట్టలేదు - రష్మిక

అల్లు అర్జున్ స్టైలిష్ లుక్
అల్లు అర్జున్ సూపర్ స్టైలిష్ లుక్
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ తో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పుష్ప మూవీ సెకండ్ పార్ట్ పుష్ప :ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన విషయం…

మై గాడ్ బన్నీ.. నిన్ను గుర్తుపట్టలేకపోయా..!
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ఏ స్థాయిలో పెరిగిందో చూస్తూనే ఉన్నాం. పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన బన్నీ మొదటి ప్రయత్నంతోనే సంచలన విజయం దక్కించుకోవడంతో పాటు నార్త్ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. తన నటన, యాస, మేకోవర్ అన్నీ ఈసినిమాకు ప్లస్ పాయింట్సే. ఇక ఈసినిమా రిలీజ్ కు ముందూ రికార్డులు క్రియేట్ చేసింది.. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి కలెక్షన్ల పరంగా కొత్త రికార్జులు క్రియేట్ చేసింది..ఇక రిలీజ్ అయిన తరువాత కూడా ఏదో ఒక రకంగా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. ఇక ప్రస్తుతం బన్నీ ఎక్కడకు వెళ్లినా తనకు రావాల్సిన క్రేజ్ మాత్రం వస్తూనే ఉంది.

అల్లు అర్జున్ ను గుర్తుపట్టలేదు - రష్మిక
తాజాగా అల్లు అర్జున్ సోషల్ మీడియా లో తన స్టైలిష్ ఫోటో ను షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని దూసుకుపోతోంది. నోటిలో సిగార్ తో , లైట్‌గా జుట్టు నెరుస్తున్నట్లు వైట్ కలరింగ్ ఇచ్చిన అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ 116 K లైక్స్ తో సోషల్ మీడియా ను షేక్ చేస్తుంది. “పొగతాగడం ఆరోగ్యానికి హానికరం”క్యాప్షన్ తో అల్లు అర్జున్ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ మాసీ లుక్ బాగుందంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.

అల్లు అర్జున్ స్టైలిష్ లుక్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైలిష్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అల్లు అర్జున్ టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ గా పేరు పొందారు. అల్లు అర్జున్ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో తెలుగు , మలయాళ ప్రేక్షకులనే కాదు డబ్బింగ్ మూవీస్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుని క్రేజీ హీరోగా మారారు. 2020 సంవత్సరం బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠపురములో .. "మూవీ తో ప్రేక్షకులను అలరించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “ మూవీ లో నటిస్తున్నారు.