
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


`జులాయి`, `సన్నాఫ్ సత్యమూరి`తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను సొంతం చేసుకున్న కాంబినేషన్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ది. ఈ ఇద్దరి కాంబినేషన్లో దాదాపు నాలుగేళ్ళ తరువాత మరో సినిమా రాబోతోంది. వీరి గత రెండు చిత్రాలను నిర్మించిన హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కూడా ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నిర్మిస్తోంది. నూతన సంవత్సరం సందర్భంగా... ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే.