ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
లిడో డాన్సర్స్‌తో డాన్స్ - ఫస్ట్ సౌత్ఇండియన్ స్టార్‌గా మరో రికార్డ్
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ సామజవరగమనా సాంగ్ షూటింగ్ కోసం యూరప్‌లో వున్నసంగతి కూడా విదితమే. అయితే అక్కడ అల్లు అర్జున్ లిడో డాన్సర్స్‌తో కలిసి స్టెప్పులేసాడట. అంతేకాదు గత 25 సంవత్సరాలుగా ఎంతో ఫేమస్ అయిన లిడో డాన్స్‌ని బన్నీ చేయడంతో తాజాగా ఆయన ఖాతాలో మరో రికార్డ్ నమోదైంది. ఫస్ట్ టైమ్ పారిస్‌లో లిడో డాన్సర్స్‌తో డాన్స్ చేసిన సౌత్ఇండియన్ స్టార్‌గా రికార్డ్ క్రియేట్ చేసాడు.