ట్యాగ్ · 2 కథనాలు
రామ్ చరణ్ కు జోడీగా మరోసారి ?
ఆర్ఆర్ఆర్ - అలియా లుక్ కు టైమ్ ఫిక్స్
రాజమౌళి దర్శకత్వంలో భారీ పీరియాడికల్ చిత్రంగా ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్-రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరమ్ భీమ్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం చివరి షూటింగ్ షెడ్యూల్ను జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ సీన్లతో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
రామ్ చరణ్ కు జోడీగా మరోసారి ?
కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు , బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ జంటగా రూపొందిన "భరత్ అనే నేను "మూవీ ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ మూవీ లో కియారా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ "అర్జున్ రెడ్డి "హిందీ రీమేక్ "కబీర్ సింగ్ "మూవీ లో కియారా కథానాయికగా నటించారు. "కబీర్ సింగ్ "మూవీ ఘనవిజయం సాధించడం తో కియారా బాలీవుడ్ లో బిజీగా మారారు.