
ట్యాగ్ · 2 కథనాలు


'అల వైకుంఠపురములో' టీజర్ గ్లింప్స్ వీడియో రిలీజ్

"అల .. వైకుంఠపురములో.." మూవీ టీజర్ రిలీజ్
త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందిన "అల .. వైకుంఠపురములో.." మూవీ జనవరి 12వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ కాగా సీనియర్ హీరోయిన్ టబు, నివేత పేతురాజ్, సుశాంత్ ముఖ్య పాత్రలలో నటించారు. అల్లు అర్జున్ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా, అతనికి లేడీ బాస్ గా పూజ నటించారు.

'అల వైకుంఠపురములో' టీజర్ గ్లింప్స్ వీడియో రిలీజ్
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటివరకూ 'సామజవరగమనా', 'రాములో రాములా' పాటలు రిలీజ్ చేయగా వాటికీ ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ రోజు టీజర్ రిలీజ్ అప్ డేట్ కూడా ఇచ్చేసారు. డిసెంబర్ 11వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక తాజాగా టీజర్ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.