
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సర్ఫీరా'. జాతీయ అవార్డు గ్రహీత సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. శాలినీ ఉషాదేవి, పూజా తోలానితో కలిసి ఆమె ఈ సినిమాకు స్క్రిప్ట్‌ను కూడా అందించారు. కాగా ఈ చిత్రం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా 2020లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'సూరారై పోట్రు'కి రీమేక్ కావడం విశేషం. నాడు డైరెక్ట్‌గా ఓటీటీలోకి విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. తెలుగులో ఇది 'ఆకాశమే హద్దురా' పేరుతో విడుదలైంది.