
సినిమా వార్తలు
ట్యాగ్ · 2 కథనాలు



కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కింగ్ నాగార్జున, నాగ చైతన్య, కృతి శెట్టి, రమ్యకృష్ణ కాంబినేషన్లో వచ్చిన సినిమా బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయన బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆ సినిమా సీక్వెల్గా బంగార్రాజు తెరకెక్కించాడు కళ్యాణ్ కృష్ణ. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మించారు.

కరోనా ఎఫెక్ట్ తో పాన్ ఇండియా మూవీస్ సంక్రాంతి రేస్ నుండి తప్పుకుంటే సంక్రాంతికి నాగార్జున తన తనయుడి తో కలసి నటించిన"బంగార్రాజు " మూవీ రిలీజ్ చేశారు. సంక్రాంతి అంటేనే ఫ్యామిలీతో సహా ఆడియెన్స్ ను థియేటర్స్ కి తీసుకొచ్చే పండుగ. అందుకే ఉన్న ఒక్క ఆప్షన్ ను వదులుకోలేక "బంగార్రాజు" మూవీ ని ప్రేక్షకులు ఆదరించారు. నాగార్జున , నాగచైతన్య తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.