
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


సక్సెస్ ఫుల్ "విక్రమ్ "(1986) మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నాగార్జున మూడున్నర దశాబ్దాలుగా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. "అన్నమయ్య ", శ్రీరామదాసు ", "షిర్డీ సాయి ", "జగద్గురు ఆది శంకర "వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 100సినిమాలకు పైగా హీరోగా నటించిన నాగార్జున బెస్ట్ యాక్టర్ గా 9నంది , 3 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. వయసు మీద పడుతున్నా నాగార్జున యంగ్ గా కనపడుతూ , యాక్టివ్ గా మూవీస్ లో నటించడం విశేషం. ఆగష్టు 29 వ తేదీ నాగ్గార్జున తన బర్త్ డే ను గ్రాండ్ గా జరుపుకున్నారు.