
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తూ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న అజిత్ కుమార్ ఆ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అజిత్ హీరోగా తెరకెక్కిన "వాలిమై"మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ నిర్మాతగా హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న "#AK61" మూవీ కి అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. "నెర్కొండ పార్వై", "వాలిమై" మూవీస్ తరువాత వీరి ముగ్గురి కలయికలో వస్తున్న మూడో సినిమా ఇది.