
సినిమా వార్తలు
ట్యాగ్ · 41 కథనాలు · పేజీ 3


ఇతర భాషా కథానాయికలు టాలీవుడ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. హిందీ తర్వాత జాతీయస్థాయిలో పెద్ద మార్కెట్ కలిగిన టాలీవుడ్‌పై కొత్త కథానాయికలు ఆసక్తి చూపుతారు. కొత్త కథానాయికలు నటించిన మొదటి సినిమా రిలీజ్ కాకుండానే టాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకొనడం విశేషం. అడివిశేష్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన "మేజర్ " మూవీ తో "దబంగ్ 3" బాలీవుడ్ మూవీ బ్యూటీ సయీ మంజ్రేకర్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న "గని "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.