
ట్యాగ్ · 1 కథనాలు


ఫస్ట్ లుక్
తేజ -శివాని మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
మల్లిక్ రామ్ దర్శకుడిగా పరిచయమవుతూ... తేజ సజ్జా, రాజశేఖర్ ముద్దుల తనయ శివానీ హీరో, హీరోయిన్లుగా కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పైన ఉంది. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడగా మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక ఇదిలా ఉండగా నేడు శివాని పుట్టినరోజు కావడంతో.. ఈసినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అద్భుతం అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేయగా.. తేజ – శివాని ఇద్దరూ ఓ టేబుల్ పై కూర్చొని టైం చూసుకుంటున్నట్లుగా మిర్రర్ ఇమేజ్ స్టైల్ లో ఈ పోస్టర్ డిజైన్ చేయబడింది. పోస్టర్ కూడా టైటిల్ కు తగ్గట్టే ఆకట్టుకుంటుంది.