సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
`కార్తికేయ` సీక్వెల్ లో టీవీ రిపోర్టర్ గా స్వాతి?
2014 నాటి డివోషనల్ థ్రిల్లర్ `కార్తికేయ`కి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. తొలి భాగంలో కథానాయకుడిగా నటించిన నిఖిల్ ఇందులోనూ హీరోగా నటిస్తున్నాడు. అలాగే `కార్తికేయ`కి దర్శకత్వం వహించిన చందు మొండేటినే ఈ సీక్వెల్ ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. అంతేకాదు.. అందులో నాయికగా నటించిన స్వాతి కూడా ఇందులో ఓ ప్రత్యేక పాత్రలో దర్శనమిస్తుందట. వినిపిస్తున్న కథనాల ప్రకారం... ఇందులో స్వాతి టీవీ రిపోర్టర్ రోల్ లో కనిపిస్తుందని, కథను కీలక మలుపు తిప్పే పాత్ర ఇదని తెలిసింది. మరి... టీవీ రిపోర్టర్ పాత్రలో స్వాతి ఏ స్థాయిలో రంజింపజేస్తుందో చూడాలి.