ట్యాగ్ · 2 కథనాలు
ఆ జ్ఞాపకాలు ఎప్పుడూ గుర్తుంటాయి..!
మాస్క్ సుందరి ప్రీతిజింటా
సూపర్ హిట్ "దిల్ సే " మూవీ తో ప్రీతిజింటా బాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించారు. సూపర్ హిట్ "ప్రేమంటే ఇదేరా " మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. మహేష్ బాబు టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన సూపర్ హిట్ మూవీ "రాజకుమారుడు" లో ప్రీతి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తరువాత ప్రీతిజింటా హిందీ మూవీస్ తో బిజీగా మారారు.ప్రీతి హీరోయిన్ గా నటించిన పలు బాలీవుడ్ మూవీస్ ఘనవిజయం సాధించాయి.
ఆ జ్ఞాపకాలు ఎప్పుడూ గుర్తుంటాయి..!
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మొదటి చిత్రం ‘రాజకుమారుడు’. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని అమ్మాయిల కలల రాకుమారుడు అయిపోయాడు మహేష్. వైజయంతి బ్యానర్లో అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించగా, సూపర్ స్టార్ కృష్ణ అతిధి పాత్రలో చేయడం విశేషం.ఇక ఈ సినిమాకు ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు కూడా లభించింది. ఇక ఈ సినిమా విడుదలై నిన్నటితో (2020 జులై 30) 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బంధం సహా హీరో మహేష్ బాబు ఈ సినిమా యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.