
ట్యాగ్ · 2 కథనాలు


`క్రిష్ 4`లో కత్రినా కైఫ్?

"సలార్ " మూవీ లో కత్రినా కైఫ్ స్పెషల్ సాంగ్ ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో శృతిహాసన్ కథానాయిక. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“సలార్ “మూవీ ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

`క్రిష్ 4`లో కత్రినా కైఫ్?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన `క్రిష్` సిరీస్ లో ఇప్పటికే మూడు చిత్రాలు వచ్చాయి. `కోయ్ మిల్ గయా` (2003), `క్రిష్` (2006), `క్రిష్ 3` (2013)... ఇలా ఈ సిరీస్ లో వచ్చిన చిత్రాలన్నీ వసూళ్ళ వర్షం కురిపించాయి. కట్ చేస్తే.. ఏడేళ్ళ తరువాత ఈ ఫ్రాంచైజీలో నాలుగో చిత్రం రాబోతోంది. `క్రిష్ 4` పేరుతో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో తొలి మూడు భాగాల్లో కథానాయకుడిగా నటించిన హృతిక్ రోషన్ నే హీరోగా నటిస్తుండగా.. హృతిక్ తండ్రి, ప్రముఖ దర్శకుడు రాకేష్ రోషన్ డైరెక్ట్ చేయనున్నాడు. త్వరలోనే ఈ సూపర్ హీరో సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.