సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
'మహాసముద్రం'లో అను ఇమ్మాన్యుయేల్
అజయ్ భూపతి దర్శకత్వంలో విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరో శర్వానంద్, ప్రతిభావంతుడైన నటుడిగా పేరు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'మహాసముద్రం'. ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్ట్రెస్ అదితి రావ్ హైదరిని ఎంపిక చేసినట్టు ఇటీవలే ప్రకటించగా.. ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. అందాల తార అను ఇమ్మాన్యుయేల్‌ను మరో హీరోయిన్ రోల్ కోసం ఎంపిక చేశారు. ఆమెది కూడా ప్రాధాన్యం ఉన్న పాత్రగా తెలుస్తుంది.