
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటిసారి డీగ్లామర్ లుక్ లో, ఊరమాస్ పాత్రలో బన్నీ కనిపిస్తుండటంతో బన్నీని ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ పై చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికితోడు ఈ సినిమా టీజర్, పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఆ అంచనాలు ఇంకా తారాస్థాయికి చేరాయి. ప్రస్తుతం అయితే షూటింగ్ ను ముంగించే పనిలో ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న సినిమా కాబట్టి అందుకు తగ్గట్టే సుకుమార్ కూడా నటీనటులను తీసుకుంటున్నాడు. దీనిలో భాగంగానే మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ఇప్పటికే షూటింగ్ లో జాయిన్…