
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. చాలా వరకూ ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈసినిమాకు ఇన్ని రోజులు బ్రేక్ పడగా.. రీసెంట్ గానే ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. మరోవైపు ఆచార్య సినిమా కూడా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా ఫైనల్లో ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు కాకుండా మరోవైపు చరణ్ శంకర్ తో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. లైకాకు.. శంకర్ కు మధ్య వివాదానికి కూడా ఫుల్ స్టాప్ పడటంతో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.