
ట్యాగ్ · 2 కథనాలు


2020 టాలీవుడ్ బెస్ట్ లీడ్ యాక్టర్..?

2020 మోస్ట్ ట్వీటెడ్ యాక్టర్స్
2020 లో ఎన్నో అనుభూతులను ఎదుర్కొన్నాం. మరి ముఖ్యంగా ఎవరూ ఊహించని విధంగా కరోనా వల్ల ప్రపంచం మొత్తం పెద్ద సంక్షోభంలో మునిగిపోయింది. అన్నిరంగాలపై కరోనా ప్రభావం పడింది. ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఇక నిరంతరం ప్రెస్ మీట్లు, షూటింగ్స్, సినిమా రిలీజ్ లు, ఆడియో ఫంక్షన్స్ అంటూ బిజీగా ఉండే సినీపరిశ్రములు మొత్తం కరోనా వల్ల బోసి పోయాయి. ఇక ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా.. ఓటీటీ ఒక్కటే సినీ లవర్స్ కు కాస్త ఊరట నిచ్చింది.

2020 టాలీవుడ్ బెస్ట్ లీడ్ యాక్టర్..?
పరిస్థితులు మాములుగా ఉంటే ఇప్పటికి ఎన్నో సినిమాలు థియేటర్స్ లో సందడి చేసేవి. కానీ ఒక్క కరోనా ప్రపంచాన్నే అతలాకుతలం చేసేసింది. ముఖ్యంగా కరోనా దెబ్బ సినీ ఇండస్ట్రీ పై బాగానే పడిందని చెప్పొచ్చు. విదేశాల్లో కాస్త ముందు నుండే దీని ప్రభావం ఉండగా మార్చి నుండి మన దేశంలో దీని ప్రభావం పడింది. ఇక లాక్ డౌన్ వల్ల ఎక్కడి షూటింగ్ లు అక్కడే ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలు పెట్టారు. కానీ సినీ లవర్స్ మాత్రం సినిమాలను చాలా మిస్ అయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు కాస్త ఎంటర్ టైన్మెంట్ అందించారు.