
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


`మెర్సల్` (అదిరింది), `సర్కార్` చిత్రాలతో రెండు వరుస ఘనవిజయాలను అందుకున్న తమిళ స్టార్ హీరో విజయ్... ప్రస్తుతం `రాజా రాణి` ఫేమ్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `తెరి`(పోలీస్), `మెర్సల్` తరువాత విజయ్ - అట్లీ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో... తమిళనాట ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. నయనతార ఓ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో ఏకంగా 18 మంది హీరోయిన్లు నటించనున్నారని సమాచారం.