యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న సరికొత్త విలేజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓ..! సుకుమారి’. భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని ‘U/A’ సర్టిఫికేట్ సంపాదించిన ఈ సినిమా టీజర్, సాంగ్స్‌తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా బిజినెస్ పరంగా ట్రేడ్ వర్గాల్లో ఇండస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఓవర్సీస్ ప్రేక్షకులకు అద్భుతమైన బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందిస్తూ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్‌గా దూసుకుపోతున్న ప్రముఖ సంస్థ ‘ప్రత్యంగిరా సినిమాస్’ ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను దక్కించుకుంది. ‘ఓ..! సుకుమారి’ చిత్రానికి ఉన్న క్రేజ్, వైవిధ్యమైన కంటెంట్‌ను నమ్మి ప్రత్యంగిరా సినిమాస్ వారు భారీ ఫ్యాన్సీ రేటుకు ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకోవడం విశేషం.
ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కు సైతం రీచ్ అయ్యేలా ‘ప్రత్యంగిరా సినిమాస్’ ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లో అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం అందిస్తున్న ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్, జూలై 17న థియేటర్లలో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి. రేపు ఈసినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























