అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన ‘లెనిన్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో అత్యంత ఘనంగా జరిగింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 10న విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ వేడుకలో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. “ఈ సినిమా సీమలో జరుగుతున్న మహాభారతమే. ఇందులో ఎక్కడా అఖిల్ కనిపించడు, కేవలం లెనిన్ మాత్రమే కనిపిస్తాడు. సాధారణంగా నేను సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నప్పుడు ‘వస్తున్నాం… కొడుతున్నాం’ అనే డైలాగ్ చెబుతుంటాను, కానీ ఈసారి అఖిల్ కోసం ఆ డైలాగ్‌ను కొద్దిగా మారుస్తూ.. జూలై 10న వస్తున్నాం… మనోడు కొడుతున్నాడు” అంటూ ఎంతో ధీమాగా స్టేజ్ పై బ్లాక్‌బస్టర్ హుకుం జారీ చేశారు.
దర్శకుడు మురళీ కిషోర్ ఈ కథను వినిపించినప్పుడు కథా నేపథ్యం శ్రీరామాపురం అని చెప్పడం, అది అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన ఊరు పేరు కావడంతో ఒక మంచి సెంటిమెంట్ కుదిరిందని నాగార్జున పేర్కొన్నారు. కథలో ఎన్నో విభిన్నమైన కోణాలు ఉన్నాయని, ముఖ్యంగా ఇందులోని ట్విస్ట్‌లు కచ్చితంగా ఎవరి ఊహలకీ అందవని భరోసా ఇచ్చారు. అఖిల్ ఇప్పటివరకు అర్బన్ లవ్ స్టోరీస్ మాత్రమే చేయడంతో ఈ మాస్ క్యారెక్టర్‌కు సెట్ అవుతాడా లేదా అని తొలుత కాస్త భయపడ్డానని, కానీ సినిమా చూశాక అఖిల్ నటనకు తానే ఆశ్చర్యపోయానని చెప్పారు. ఇందులో ఒక అందమైన ప్రేమకథ కూడా ఉందని, కథానాయిక భాగ్యశ్రీ పోషించిన భారతి పాత్ర ఈ సినిమాకు గుండె చప్పుడులా నిలుస్తుందని తెలిపారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























