విలక్షణ నటుడు కమల్ హాసన్ చాలా గ్యాప్ తరువాత విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఇండియన్2 సినిమాతో వస్తున్నాడు. భారతీయుడు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ కు వచ్చిన అడ్డంకులు అన్నీ ఇన్నీ కాదు. అప్పట్లోనే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇక ఈమధ్యకాలంలోనే మళ్లీ ఈసినిమా షూటంగ్ ను మొదలుపెట్టారు. ఒకపక్క చరణ్ సినిమా కంప్లీట్ చేస్తూనే మరోపక్క ఇండియన్ 2 సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడు శంకర్. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో టాలీవుడ్ టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్ విలన్ పాత్రలో నటిస్తున్నాడని వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఈవార్తలపై తాజాగా వెన్నెల కిషోర్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. నిజానికి తాను ఇండియన్ 2 లో కానీ పాకిస్థాన్ 3 లో కానీ నటించడం లేదని, దయచేసి ఇటువంటి రూమర్స్ నమ్మవద్దని ఆయన తెలిపారు. మరి వెన్నెల కిషోర్ క్లారిటీ ఇచ్చాడు కనుక ఇప్పటికైనా ఈ వార్తలకు బ్రేక్ పడుతుందేమో చూద్దాం.
కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























