కాంతార పై కంగనా రియాక్షన్

kangana ranaut reaction on kantara movie, Actress Kangana Ranaut, Rishab Shetty, Sapthami Gowda, kangana ranaut, kantara, kantara Movie Updates, kantara Telugu Movie Latest News, kantara Latest Update, kantara Movie, kantara Movie Latest News And Updates, kantara New Update, kantara Telugu Movie, kantara Telugu Movie Live Updates, kantara Telugu Movie New Update, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టే సినిమాలు కొన్ని ఉంటాయి. కేవలం మౌత్ టాక్ తోనే బాక్సాఫీస్ బద్దలు కొడుతుంటాయి. అలా వచ్చిన సినిమానే కాంతార అని చెప్పొచ్చు. కన్నడలో వచ్చిన ఈసినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఇక్కడ ప్రభాస్ ఈసినిమా గురించి పోస్ట్ చేసినతరువాతే చాలా మందికి తెలిసిందని కూడా చెప్పొచ్చు. ఈసినిమాను కె.జి.యఫ్ మేకర్స్ నిర్మించడం.. అక్కడ హిట్ అవ్వడంతో గీతా ఆర్ట్స్ వారు తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. ఇక తెలుగులో కూడా ఈసినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ ను చూసి అర్థంచేసుకోవచ్చు. సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇక్కడ మాత్రమే కాదు ఈమధ్య సౌత్ సినిమాలు నార్త్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తున్నాయో చూస్తున్నాం. ఈమధ్యకాలంలో చాలా సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ ను కొల్లగొట్టాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి కాంతార సినిమా కూడా చేరిపోయింది. ఇక తాజాగా ఈసినిమాను చూసిన కంగనా సినిమాపై ప్రశంసలు కురిపించింది. ఈసినిమాను చూసిన కంగనా తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. కాంతార సినిమా చూశానని.. ఇప్పటికీ తన శరీరం వణుకుతోందని అన్నారు. ఈ చిత్రాన్ని వీక్షించడం ఒక అద్భుతమైన అనుభవమని చెప్పారు. జానపద కథలు, సంప్రదాయాలు అన్నీ కలిసిన సినిమా అని అన్నారు. రిషబ్ శెట్టి నీకు హ్యాట్సాఫ్. రచన, దర్శకత్వం, నటన, యాక్షన్ అంతా అద్భుతం. నమ్మలేకపోతున్నా. అందమైన ఫొటోగ్రఫీ, యాక్షన్, థ్రిల్లర్. సినిమా అంటే ఇలా ఉండాలి. ప్రేక్షకులు థియేటర్ కు వచ్చి సినిమా చూడాలంటే ఇలా ఉండాలి. ఇలాంటి సినిమా తీసినందుకు ధన్యవాదాలు. మరో వారం పాటు ఈ అనుభూతి నుంచి నేను బయటకు రాలేననే అనుకుంటున్నా’ అని పోస్ట్ లో పేర్కొంది.

కాగా కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కాంతార సినిమాలో అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, సప్తమీ గౌడ తదితరులు నటించారు. హెంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించారు. అజిత్ లోక్ నాథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫి, ప్రతీక్ శెట్టి ఈసినిమాకు ఎడిటర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =