కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

మూడు రోజులకు 200 కోట్ల క్లబ్ లో పొన్నియిన్ సెల్వన్ 1

PS1 Movie Enters 200 Crores Club, 200 Crores Club, PS1 Movie Latest Collections, Ponniyin Selvan Movie Latest Collections, Ponniyin Selvan Telugu Movie Latest Collections, Ponniyin Selvan Collections, PS1 Collections, Vikram,Mani Ratnam,AR Rahman,Ais

మూడు రోజులకు 200 కోట్ల క్లబ్ లో పొన్నియిన్ సెల్వన్ 1

PS1 Movie Enters 200 Crores Club

PS1 Movie Enters 200 Crores Club, 200 Crores Club, PS1 Movie Latest Collections, Ponniyin Selvan Movie Latest Collections, Ponniyin Selvan Telugu Movie Latest Collections, Ponniyin Selvan Collections, PS1 Collections, Vikram,Mani Ratnam,AR Rahman,Ais

మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్1 మూవీ కి ఆయా భాషల స్టార్ హీరోస్ వాయిస్ ఓవర్ ఇవ్వటం విశేషం.

సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న పొన్నియిన్ సెల్వన్ మూవీ ఫస్ట్ పార్ట్ పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ రాబడుతుంది. నటీ నటులు అందరూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన పొన్నియిన్ సెల్వన్ 1మూవీ ప్రపంచవ్యాప్తంగా మూడు రోజులకు 230 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 200 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ మూవీ అన్ని భాషలలోనూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్