విబ్రి మీడియా , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి , లెజెండరీ యాక్ట్రెస్ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ “తలైవి “మూవీ తెలుగు , తమిళ , హిందీ భాషలలో సెప్టెంబర్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. జయలలిత రియల్ , రీల్ లైఫ్ ముఖ్య సంఘటనలతో తెరకెక్కిన “తలైవి ” మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా -జయలలిత , అరవింద్ స్వామి -ఎమ్ జి ఆర్ , ప్రకాష్ రాజ్ -కరుణానిధి , జానకి రామచంద్రన్ -మధుబాల , పూర్ణ -శశికళ , భాగ్యశ్రీ – జయలలిత మదర్ సంధ్య పాత్రలలో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“తలైవి “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. “తలైవి” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో అరవింద్ స్వామి మాట్లాడుతూ… ఎన్నో సినిమాల్లో నటించాను కానీ ఈ సినిమాలో భాగం కావడం చాలా అద్భుతమైన అనుభవం అనీ , “తలైవి” సినిమాతో మీ అందరి ముందుకు రావడం ఆనందంగా ఉందనీ , ఈ సినిమా టీమ్‌తో పనిచేయడం హ్యాపీగా అనిపించిందనీ , దర్శకుడు విజయ్ సార్‌తో పాటు చిత్రయూనిట్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలనీ , రెండు రోజుల క్రితం ఈ సినిమా చూశాననీ , “తలైవి “మూవీ బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నమ్ముతున్నాననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.