2020 మోస్ట్ ట్వీటెడ్ యాక్ట్రెస్

Twitter Unviels The List Of Most Tweeted actress In 2020

ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా రివైండ్ 2020లో భాగంగా ట్విట్టర్‌లో అత్యధికంగా లైకులు పొందిన ట్వీట్స్, సబ్జెక్ట్స్ , రీట్వీట్లు పొందిన ట్వీట్లు ఇలా పలు అంశాలకు సంబంధించిన లిస్ట్ ను విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది మోస్ట్ ట్వీటెడ్ యాక్టర్స్ కు సంబంధించిన లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ లిస్ట్ లో మహేష్ బాబు నెంబర్ వన్ గా నిలిచాడు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో ఇళయ దళపతి విజయ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూర్య, అల్లు అర్జున్, రామ్ చరణ్, ధనుష్, మోహన్ లాల్, చిరంజీవి నిలిచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా దక్షిణాదిలో మోస్ట్ ట్వీటెడ్ నటీమణుల లిస్ట్ కూడా ట్విట్టర్ విడుదల చేసింది. హీరోయిన్ ల జాబితాలో మహానటి కీర్తి సురేష్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరవాత వరుసగా కాజల్ రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆ తరవాత వరుసగా సమంత, రష్మీక, పూజ హెగ్డే, తాప్సి, తమన్నా, రకుల్ ప్రీత్, శృతిహాసన్, త్రిష లు ఉన్నారు.

మహానటి సినిమాతో కీర్తి సురేష్ రేంజ్ మారిపోయింది. ఆ సినిమాలో నటనతో అదరగొట్టిన కీర్తి వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. మరో వైపు కమర్షియల్ సినిమాలను కూడా లైన్ లో పెడుతుంది. ప్రస్తుతం పరుశురాం-మహేష్ కాంబినేషన్ లో వస్తున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుంది. విచిత్రం ఏంటంటే హీరోస్ లో మహేష్ బాబు.. హీరోయిన్స్ లో కీర్తి నెంబర్ వన్ స్థానంలో నిలవడం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − four =