సినిమా వార్తలు
ట్యాగ్ · 41 కథనాలు · పేజీ 3
సినిమా వార్తలు
చరణ్ పై కన్నేసిన వంశీ పైడిపల్లి..!
మహర్షి సినిమాతో మంచి హిట్ కొట్టాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఆ సినిమా తర్వాత ఇంత వరకూ ఇంకేం సినిమాను ఇప్పటివరకూ ప్రకటించలేదు. అయితే మహర్షి తీసిన మహేష్ తోనే మళ్ళీ వంశీ సినిమా ఉంటుందని..జోరుగా వార్తలు వచ్చాయి. సరిలేరు నీకెవ్వరు తర్వాత దాదాపు వీరిద్దరి కాంబినేషన్ లోనే సినిమా అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఏమైందో తెలియదు కానీ పరుశురాం లైన్ లోకి వచ్చాడు. ప్రస్తుతం మహేష్ 'గీత గోవిందం' డైరెక్టర్ పరుశురాం తో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ వార్త కన్ఫామ్ అయిపోయింది. మే చివరిలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది.