
ట్యాగ్ · 3 కథనాలు

త్వరగానే కోలుకున్నా - త్వరగా ఇంటికి తిరిగి వస్తా అనుకోలేదు
మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తర్వాత దాదాపు ఏడు నెలల విరామం తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టింది తమన్నా. ఇక్కడికి వచ్చిన దగ్గరనుండి ఆమె ఓ వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కరోనా సోకడంతో ఇన్ని రోజులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లోనే చికిత్స తీసుకుంది. ఇక ఇప్పుడు కరోనా తగ్గిపోవడంతో తిరిగి తన హోమ్ టౌన్ ముంబై తిరిగి వెళ్ళిపోయింది.

తమన్నా షూటింగ్ అనుభవాలు
కరోనా వైరస్ కారణంగా స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న స్టార్ హీరోయిన్ తమన్నా తన షూటింగ్ అనుభవాలు, మూవీ కమిట్ మెంట్స్ గురించి మీడియా కు వెల్లడించారు. ముందుగా బ్లాక్ బస్టర్ "బాహుబలి " మూవీ గురించి తమన్నా మాట్లాడుతూ .. కుండపోత వర్షాలలో మహాబలేశ్వర్ లో తనపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారని , మోకాళ్ళ లోతు నీళ్ళు ఉన్న ప్రాంతాలలో షూటింగ్ జరిగిందని, తాను షూటింగ్ లో ఉండగా తన గ్రాండ్ మదర్ మరణించారని, యూనిట్ సభ్యులందరూ తనకు సపోర్ట్ గా నిలిచారని చెప్పారు.
తమన్నా యోగాసనాలు
కరోనా వైరస్ ప్రజల దైనందిక జీవితాలపై అత్యంత ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ ప్రజల ధన, ప్రాణ నష్టాలకు గురిచేస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పరిశుభ్రత, సామజిక దూరం పాటిస్తూ ఈ వైరస్ ను కట్టడి చేయవచ్చు. ఇప్పటికే మాల్స్, థియేటర్స్, షూటింగ్స్ రద్దు చేశారు . ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండగా, సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా స్వీయ గృహ నిర్బంధం లో ఉంటున్న విషయం తెలిసిందే.