
ట్యాగ్ · 41 కథనాలు · పేజీ 3


సినిమా వార్తలు
"#SSMB 28 " మూవీ కై ఫేమస్ ఫైట్ మాస్టర్స్ అన్బరివు సోదరులు ?
శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా #SSMB 28 ” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక. “అతడు “, “ఖలేజా ” మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB 28 ”మూవీ పూజా కార్యక్రమం తో ప్రారంభం అయ్యింది. ఈ పూజా కార్యక్రమానికి మహేష్ బాబు సతీమణి నమ్రత , హీరోయిన్ పూజాహెగ్డే హాజరు అయ్యారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న “#SSMB 28″మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.