
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు


ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో వచ్చిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ '96' సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న ఈ రీమేక్ కు కూడా తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ రీమేక్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.