
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


2010లో ‘లీడర్' సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు రానా. ఇక అప్పటినుండి డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తన మొదటి సినిమా లీడర్ నుండి ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో ప్రతి సినిమాలో ఏదో ఒక విభిన్నత ఉంటుంది. అందుకే రానా సినిమా అంటే అందరికీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇటీవలే విరాట పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా ఎన్నో సార్లు వాయిదా పడుతూ ఫైనల్ గా ఇటీవలే రిలీజ్ అయింది. ఇక కలెక్షన్స్ పరంగా సినిమా నిరాశ పరిచినా పెర్ఫామెన్స్ పరంగా మాత్రం విమర్శకుల ప్రశంసలు కురిపించారు.