
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఈ లిస్టు లోకి ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా సినిమా చేరింది. సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ 'ప్రేమికుడు' సినిమా త్వరలో రీ-రిలీజ్ అవబోతోంది. 30 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 13న థియేటర్లలో ఘనంగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ నిర్మాతలుగా రమణ గారు, మురళీధర్ గారు వ్యవహరిస్తున్నారు.