
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


మళ్లీ కరోనా కేసులు ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. మళ్లీ కొత్త కేసులు నమోదువుతున్నాయి. ఈనేపథ్యంలోనే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా కరోనా బారినపడ్డారు. తాజాగా, చేసిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. తాను పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నానని బాలకృష్ణ తెలిపారు. గత రెండు రోజులుగా తనని కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీంతో ఫ్యాన్స్ కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కాగా కరోనా వల్ల సినీ పరిశ్రమకు ఎంత నష్టం జరిగిందో చూశాం. ఆర్థికంగా చాలా నష్టపోయింది. అంతేకాదు ఎంతోమంది సినీ సెసిబ్రిటీలు కరోనా…