
షూటింగ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో పలానా అబ్బాయి.. పలానా అమ్మాయి సినిమా కూడా ఒకటి. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాను కూడా ఎప్పుడో ప్రారంభించారు. అయితే మధ్యలో నాగశౌర్య పలు సినిమాలతో బిజీగా ఉండటం.. కరోనా వల్ల ఈసినిమా షూట్ కు లేట్ అయింది. ఇక రీసెంట్ గానే మళ్లీ ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా తెలియచేసింది.