
ట్యాగ్ · 3 కథనాలు


వాట్ ద ఫిష్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

ఏడేళ్ళ గ్యాప్ తర్వాత, ఏడు అడుగులేసి మళ్ళీ ఇండస్ట్రీలోకి వస్తున్నా - మంచు మనోజ్
తమని ఎంతగానో అభిమానించే అభిమాని కోసం ఒక సెలబ్రిటీ ఆడే ఆట ‘ఉస్తాద్’, ఇంత గొప్ప కాన్సప్ట్ ని హోస్ట్ చేయడం చాలా ఆనందంగా వుందిని పేర్కొన్నారు రాక్ స్టార్ మంచు మనోజ్. ఈ మేరకు ఆయన హోస్ట్‌గా ‘ఉస్తాద్’ ర్యాంప్ ఆడిద్దాం.. పేరిట సరికొత్త టాక్ షో ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ టాక్ షో డిసెంబర్ 15 నుంచి ఈటీవీ విన్‌లో ప్రసారం కానుంది. ఈనేపధ్యంలో ప్రోమో రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు.

వాట్ ద ఫిష్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
మంచు వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో మనోజ్. అయితే మనోజ్ కు మాత్రం ఇప్పటివరకూ బ్లాక్ బస్టర్ హిట్ అనేది దక్కింది లేదు. కెరీర్ మొదట్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన ఈమధ్య సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత కొత్త సినిమాతో రావడానికి సిద్దమవుతున్నాడు. వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో మనోజ్ హీరోగా వస్తున్న సినిమా వాట్ ద ఫిష్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

మంచు మనోజ్ న్యూ మూవీ అనౌన్స్ మెంట్
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ప్రస్తుతం శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అహం బ్రహ్మాస్మి మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. త్వరలోనే స్పెషల్ న్యూస్ ఒకటి చెప్తా అంటూ మంచు మనోజ్ అప్‌డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. వరుణ్ దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా మనం మనం బరంపురం క్యాప్షన్ తో What The Fish... మూవీ అనౌన్స్ మెంట్ పోస్టర్ లాంఛ్ చేసి తన ఫాలోవర్లకు మనోజ్ గుడ్‌న్యూస్ చెప్పారు.