ట్యాగ్ · 2 కథనాలు
యోగ టిప్స్ చెపుతున్న రెబల్ స్టార్..!
రేపు ప్రపంచ యోగా దినోత్సవం అన్న సంగతి తెలిసిందే కదా. జూన్ 21న ప్రపంచమంతా 6వ అంతర్జాతీయ యోగా డే సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది. నిజానికి ప్రతి ఏడు బహిరంగ ప్రదేశాల్లో యోగ డే సెలెబ్రేట్ చేసేవాళ్ళు. అయితే కరోనా వైరస్ కారణంగా ఈసారి బహిరంగ ప్రదేశాలు, స్టేడియాల్లో యోగా దినోత్సవం జరుపుకోవడం సాధ్యం కాదు. భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉండటంతో ఎక్కడివారక్కడే యోగా డే సెలబ్రేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రధాని సహాయ నిధికి రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబ విరాళం
“ ప్రపంచమంతా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ సమాజంలోని అన్ని వర్గాల వారు స్పందించాల్సిన అవసరం ఉంది ” అన్నారు సుప్రసిద్ధ నటులు, నిర్మాత, మాజీ కేంద్ర మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు. ఆయన కుటుంబ సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిలీఫ్ ఫండ్ కు 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసిన సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ " కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితులను అధిగమించటానికి డాక్టర్లు, నర్సులు , పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా ఇంకా అనేక శాఖల వారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వారి త్యాగం, కష్టం వెలకట్టలేనివి.