
ట్యాగ్ · 2 కథనాలు


తిరుమల శ్రీవారి సన్నిధి లో ఎన్టీఆర్ ఫ్యామిలీ

ముత్తాత(ఎన్టీఆర్)పోలికలతో భార్గవ్ రామ్
లెజెండరీ యాక్టర్ నందమూరి తారకరామారావు మనవడు , ఫిల్మ్ యాక్టర్ , పొలిటీషియన్ హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. నార్నే ఎస్టేట్స్ అధినేత నార్నే శ్రీనివాస్ తనయ లక్ష్మి ప్రణతిని 2011 సంవత్సరంలో ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు. వీరికి అభయ్ రామ్ , భార్గవ్ రామ్ తనయులు.

తిరుమల శ్రీవారి సన్నిధి లో ఎన్టీఆర్ ఫ్యామిలీ
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన "ఆర్ ఆర్ ఆర్ " మూవీ ప్రపంచవ్యాప్తంగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఆ మూవీ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న "#NTR 30" మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఆ మూవీ ప్రమోషన్స్ లో కూడా ఎన్టీఆర్ బిజీగా ఉండడంతో ఎన్టీఆర్ మినహా మిగిలిన కుటుంబ సభ్యులంతా తిరుమలకు వెళ్లారు.