
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు


తెలుగు అమ్మాయి అంజలి టైటిల్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. 2014లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. 'నిన్ను కోరి', 'నిశ్శబ్దం' చిత్రాలకు కొరియోగ్రఫీ చేసిన అట్లాంటా (యూఎస్)కు చెందిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై నిర్మాతలు ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.