
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు

బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడిగా తెరంగేట్రం చేసిన టైగర్ ష్రాఫ్.. కొద్దిరోజుల్లోనే స్టార్ హీరో స్టేటస్ అందుకున్నాడు. కేవలం వారసత్వాన్నే నమ్ముకోకుండా డ్యాన్స్, ఫైట్స్, నటనలో తన టాలెంట్ చూపించి మంచి పేరు తెచ్చుకున్నాడు. కాగా టైగర్ ష్రాఫ్ సినిమాలలో యాక్షన్ హై వోల్టేజ్ లో ఉంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం 'గణపథ్'. 'ఏ హీరో ఇస్ బార్న్' అనేది ఉపశీర్షిక. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది.