
ట్యాగ్ · 3 కథనాలు


దేవర నుంచి ఫియర్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నారు. ఇంకా ప్రకాష్ రాజ్, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

దేవర ఫియర్ సాంగ్ రెస్పాన్స్ అదిరింది
దేవర నుండి వచ్చిన ఫస్ట్ సాంగ్ ఫియర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. 24గంటల్లో ఈ సాంగ్ అన్ని భాషల్లో కలిపి 28 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టింది. దాంతో రీసెంట్ విడుదలైన పుష్ప 2 సాంగ్ ను క్రాస్ చేసింది.పుష్ప సాంగ్ 26మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా దేవర తెలుగు తోపాటు హిందీ లో అదరగొడుతుంది. తెలుగు వెర్షన్ ఇప్పటివరకు 18మిలియన్ల వ్యూస్ ను తెచ్చుకోగా హిందీ 12మిలియన్ల వ్యూస్ ను రాబట్టుకుంది.ఓవరాల్ గా ఫియర్ సాంగ్ అంచనాలను అందుకొని సినిమాకు వున్న హైప్ పెంచేసింది.

దేవర- గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ఫియర్ సాంగ్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దేవర. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రాబోతుంది. రెండు పార్ట్ లుగా ఈసినిమా రాబోతున్న నేపథ్యంలో అక్టోబర్ 10వ తేదీన ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.