
ట్యాగ్ · 2 కథనాలు

'ఫలక్ నుమా ప్యాలెస్' లో రాధే శ్యామ్

ది ప్యారడైజ్ కోసం భారీ సెట్
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి నాని లుక్, అలాగే ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న మోహన్ బాబు పోస్టర్‌లు ఇప్పటికే నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీత, నటి సోనాలి కులకర్ణి ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది. అలాగే కిల్ ఫేం రాఘవ్ జుయల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. కేవలం కాస్టింగ్ తోనే భారీ హైప్ క్రియేట్ చేశారు.
'ఫలక్ నుమా ప్యాలెస్' లో రాధే శ్యామ్
‘బాహుబలి’, ‘సాహో’తో ప్యాన్ ఇండియా స్టార్ రేంజ్ కు ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వం లో రాధేశ్యామ్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్‌లుక్, 'బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్' వీడియోకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి. ఇక టీజర్ ఎప్పుడేప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ రీసెంట్ గా ఒక ఓ ప్రామిస్ చేసిన సంగతి కూడా విదితమే. త్వరలోనే ఈ సినిమా టీజర్ అప్ డేట్ ఇస్తానని చెప్పాడు.